EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఖాతాలను కలిగి ఉన్నారు. పీఎఫ్ సేవలను సులువుగా ఉపయోగించుకునేలా ఈపీఎఫ్‌వో ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్‌కు సంబంధించిన అనుమానాలు, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈపీఎఫ్‌వో వాట్సప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా ఖాతాదారులు తమ ఫిర్యాదులు తెలపవచ్చు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి ప్రయత్నం చేశారు. ప్రతీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఓ వాట్సప్ హెల్ఫ్‌లైన్ నెంబర్ ప్రవేశపెట్టింది. స్థానిక…
