తాజావార్తలు

తన జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేయాలనుకున్నా సరే.. నేను వెనక్కి తగ్గను : పార్వతి


తనను ఇండస్ట్రీలోని కొంతమంది కావాలనే ఒంటరిని చేశారని, ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని వెల్లడించారు. ఇంతకీ పార్వతి చేసిన వ్యాఖ్యలేంటి? అప్పట్లో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? 2016లో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కసాబా’ విడుదలైంది. ఈ సినిమాలో మహిళలను కించపరిచేలా ఉన్న కొన్ని సంభాషణలు, సన్నివేశాలపై పార్వతి తిరువోతు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2017లో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFK) సందర్భంగా జరిగిన చర్చలో ఆమె తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *