చాలా మంది అడవులను అన్వేషించడం, ప్రకృతిని దగ్గరగా గమనించడం ఆనందిస్తారు. కానీ, కొన్నిసార్లు ఈ ఇష్టమే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కెనడాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ప్రమాదకరమైన గ్రిజ్లీ ఎలుగుబంటిని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మౌంట్ ఎంగాడిన్ లాడ్జ్ సమీపంలో సదరు మహిళ తన పెంపుడు కుక్క స్కోకితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 180 కిలోల బరువున్న ఒక భారీ గ్రిజ్లీ ఎలుగుబంటి వారి ముందుకు వచ్చింది. మనిషిని, కుక్కను చూడగానే ఆ క్రూర జంతువు వారిని వెంటాడటం ప్రారంభించింది.
దాడికి ప్రయత్నం – ఊహించని ధైర్యం
ఎలుగుబంటి తమ వైపు వస్తుండటాన్ని గమనించిన మహిళ కంగారుపడి పరుగెత్తలేదు. ఎందుకంటే ఎలుగుబంటిని చూసి పరిగెత్తితే అది మరింత రెచ్చిపోయి వేగంగా దాడి చేస్తుంది. అందుకే ఆమె వెనక్కి అడుగులు వేస్తూనే ఎంతో గంభీరమైన స్వరంతో నో.. గో అవే (వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో) అంటూ ఎలుగుబంటిని వారించడానికి ప్రయత్నించింది. కానీ, ఆ ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమె వైపు దూసుకొచ్చింది (Charge చేసింది). ఒక దశలో అది కేవలం ఒక మీటరు దూరంలోకి వచ్చేసింది.
ఇవి కూడా చదవండి
ఆ సమయంలో ఆమె భయంతో కేకలు వేస్తూనే, స్టాప్ ఇట్.. గో అవే.. ఇనఫ్ (ఆపు, వెళ్ళిపో, ఇక చాలు) అంటూ ఎలుగుబంటి కళ్లల్లోకి చూస్తూ నిలబడింది. ఆ మహిళా చూపిన అద్భుతమైన ఆత్మవిశ్వాసం, ధైర్యం చూసి ఆ గ్రిజ్లీ ఎలుగుబంటి కొంత గందరగోళానికి గురైంది. కొద్దిసేపు అక్కడే తిరుగుతూ దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఆమె అరుపులకు వెనక్కి తగ్గి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి..
A woman hiking in Canada nearly became a grizzly’s next meal and the video circulating right now is genuinely one of the most intense wildlife encounters you will ever watch – her dog is with her, a massive grizzly is right there, and somehow she kept her head together long… pic.twitter.com/VutSzXLeXM
— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) June 26, 2026
అధికారుల హెచ్చరిక…
ఈ సంఘటన తర్వాత అప్రమత్తమైన ఆల్బెర్టా ఫారెస్ట్రీ అండ్ పార్క్స్ అధికారులు ఆ ప్రాంతంలో బేర్ వార్నింగ్ (ఎలుగుబంట్ల హెచ్చరిక) జారీ చేశారు. వన్యప్రాణుల నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుగుబంట్లు సాధారణంగా కుక్కల పట్ల ఎక్కువ ఆసక్తిని లేదా దూకుడును ప్రదర్శిస్తాయి. అందువల్ల అడవుల్లోకి వెళ్లేటప్పుడు కేవలం బేర్ బెల్స్ (గంటలు) పైనే ఆధారపడకుండా, రక్షణ కోసం బేర్ స్ప్రేను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పర్యాటకులకు సూచిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న ఆ మహిళ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
