ప్రముఖ నటి రూపా దేవి గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో ఋతురాగాలు సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ఆమె.. కన్నడలో మాత్రం టాప్ హీరోయిన్ గా ఎదిగారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. అలాగే దివంగత తారలైన సిల్క్ స్మిత, శ్రీవిద్యల వ్యక్తిగత జీవితాల గురించి, చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే సవాళ్ల గురించి తన అనుభవాలను చెప్పుకోచ్చారు. సిల్క్ స్మితతో తన అనుబంధం, ఆమె స్వభావం, అలాగే సినీ తారలు ఎదుర్కొనే ఆర్థిక అభద్రత, వ్యక్తిగత సమస్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూపా దేవి సిల్క్ స్మితతో రెండు, మూడు మలయాళ చిత్రాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సిల్క్ స్మితను ఒక “మంచి అమ్మాయి” అని అన్నారు. ఆమెకు అహంకారం లేదని స్పష్టం చేశారు. ఆమె మాట్లాడే విధానం చిన్నపిల్లల వలె ఉండేదని, కానీ ఆమెను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకునేవారని అన్నారు. తాను సిల్క్ స్మితను మొదట అహంకారి అనుకున్నానని.. కానీ ఆమెతో గడిపిన తర్వాత అది ఆమె సహజ స్వభావమని తెలుసుకున్నట్లు రూపా దేవి వివరించారు. తల్లిదండ్రుల మద్దతు లేకపోవడం వల్ల ఆమె “తప్పుదోవ పట్టారని” రూపా దేవి అన్నారు. చదువు అంతగా లేకపోయినా, సిల్క్ స్మిత తన కళ్లతోనే సంభాషణను పలికించేదని, ఒక వ్యాంప్ పాత్రకు సరికొత్త నిర్వచనం ఇచ్చి, తన సొంత కాస్ట్యూమ్స్‌ను ఎంచుకొని, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..
సిల్క్ స్మిత మరణించినప్పుడు తాను అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు వెళ్లలేకపోయానని, అయితే ఆమె మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి గురైందని వినడం చాలా బాధించిందని రూపా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. నటీమణులు ఎదుర్కొనే సాధారణ ఆర్థిక సమస్యలను రూపా దేవి ప్రస్తావించారు. చాలా మంది నటీమణులు ఆర్థిక విషయాల్లో తప్పుడు అడుగులు వేస్తారని, ఆస్తులు ఇతరుల పేర్ల మీద కొనుగోలు చేయడం వల్ల చివరికి నష్టపోతారని హెచ్చరించారు. సినీ కెరీర్ దీర్ఘకాలం ఉండదని గ్రహించి, నటీమణులు వ్యక్తిగతంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక ఉన్నత జీవనశైలికి అలవాటుపడిన తర్వాత, దాన్ని కొనసాగించలేకపోతే మానసికంగా కుంగిపోతారని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Raghu Babu : ఆ సినిమా తర్వాత అవకాశాలే రాలేదు.. నన్ను చూసి జనాలు భయపడ్డారు.. నటుడు రఘుబాబు..
అలాగే, రూపా దేవి దివంగత నటి శ్రీవిద్య గురించి కూడా మాట్లాడారు. శ్రీవిద్య అద్భుతమైన, అందమైన నటి అని, ఆమె “రీగల్”గా ఉండేవారని చెప్పారు. మలయాళంలో తన మొదటి సినిమాలో శ్రీవిద్య తన తల్లి పాత్రలో నటించారని గుర్తుచేసుకున్నారు. శ్రీవిద్య వ్యక్తిగత జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నారని, ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వైవాహిక సమస్యలు, పిల్లలు లేకపోవడం ఆమెను బాధించాయని అన్నారు. శ్రీవిద్య మరణం ఆత్మహత్య కాదని, సహజ మరణమే అని రూపా దేవి స్పష్టం చేశారు. శ్రీవిద్య ఆర్థికంగా ఇబ్బంది పడకపోయినప్పటికీ, తాను సంపాదించి నిర్మించిన ఇల్లు తన పేరు మీద లేకపోవడం ఆమెను మానసికంగా దెబ్బతీసిందని వివరించారు. చెన్నైలోని టీ నగర్‌లో ఉన్న ఆ పెద్ద ఇల్లు తన పేరు మీద లేదని తెలుసుకున్నప్పుడు ఆమె హృదయం విరిగిపోయిందని, అది ఆమెను తట్టుకోలేని విధంగా చేసిందని విన్నానని రూపా దేవి చెప్పారు. బాబు పుట్టిన తర్వాత తాను నటన మానేసినప్పుడు శ్రీవిద్య తనను అభినందించారని, “వివాహం తర్వాత సినిమాలు మానేసి, బాబును కన్నందుకు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు” అని శ్రీవిద్య చెప్పినప్పుడు, ఆమె లోలోపల ఎంత బాధను అనుభవించి ఉంటారో అర్థమైందని రూపా దేవి పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Samantha : సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు.. 2 ఏళ్లు అలాంటి ఆహారం.. నందినీరెడ్డి..
సిల్క్ స్మిత..
Silk Smitha News
ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..
