సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ఇటీవలే జైలర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ భారీ వసూళ్లతో దుమ్మురేపుతుంది. ఈ చిత్రంలోని బీజీఎమ్ గురించి చెప్పక్కర్లేదు. అటు తమిళంతోపాటు తెలుగులోనూ సత్తా చాటుతుంది ఈ ప్రాజెక్ట్. ఈ క్రమంలోనే వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న తలైవా, తాజాగా తన లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ సరసన టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి నటిస్తున్నట్లు సమాచారం. రజినీ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ధర్మన్.
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
సూపర్ స్టార్ రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతారలది టాలీవుడ్ , కోలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా పేరుంది. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన పలు సినిమాలు ఘన విజయం సాధించాయి. తాజాగా రానున్న ఈ కొత్త చిత్రం ధర్మన్ లో కూడా వీరిద్దరూ మరోసారి జతకట్టనుండటంతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నప్పటికీ, ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందనే వార్త మాత్రం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న సినిమాలతో పాటు ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడుఅరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా, సినిమాలోని ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ఏది ఏమైనప్పటికీ, తలైవా సరసన నయనతార మరోసారి అలరించనుండటం అభిమానులకు పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరోసారి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..
నయనతార..
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
