తాజావార్తలు

Suman : ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనే.. కలిసి కెరీర్ స్టార్ట్ చేశాం.. కానీ ఇప్పుడు తను.. సుమన్…

Suman : ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనే.. కలిసి కెరీర్ స్టార్ట్ చేశాం.. కానీ ఇప్పుడు తను.. సుమన్…


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా దూసుపోయిన నటుడు సుమన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా గ్రాఫ్ తగ్గిపోయింది. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సహయ నటుడిగా కనిపించి మెప్పించారు. బుల్లితెరపై పలు సీరియల్స్, వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీ ప్రయాణం, ప్రాజెక్టులు, తన అభిమాన సహనటి గురించి చెప్పుకొచ్చారు. మంగళూరులో పుట్టి, చెన్నైలో విద్యనభ్యసించి, కోలీవుడ్‌లో అడుగుపెట్టి, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. “కౌబాయ్”, “లవ్ బాయ్” , మార్షల్ ఆర్ట్స్‌తో “కరాటే బాయ్” వంటి విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నిజాయితీ గల పోలీస్ అధికారిగా, వ్యవస్థ మీద పోరాటం చేసే నాయకుడిగా, అమాయకమైన బావమరిదిగా, అలాగే అన్నమయ్యను ఆశీర్వదించిన వెంకటేశ్వర స్వామిగా పలు మరపురాని పాత్రలతో సుమన్ అలరించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

ప్రస్తుతం సుమన్ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో చురుకుగా నటిస్తున్నారు. ఇటీవల ఒరియా చిత్రాల్లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఒక ఒరియా చిత్రంలో తెలుగు , ఒరియా వెర్షన్లకు ఒకే పాత్రను పోషించే అవకాశం లభించిందని తెలిపారు. వివిధ భాషల్లో సంభాషణలను సులభంగా అర్థం చేసుకోవడానికి, వాటిని ఇంగ్లీష్ లో వ్రాసుకుంటానని ఆయన వెల్లడించారు. ముగ్గురు అందమైన నటీమణులలో తన బెస్ట్ కోస్టార్ ఎవరని అడిగినప్పుడు, సుమన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తాను విజయశాంతితో, భానుప్రియతో ఎక్కువగా నటించినట్లు పేర్కొన్నారు. అయితే, తన అభిమాన సహనటి విజయశాంతి అని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది.. యాంకరమ్మ బ్యాడ్ లక్..

వారిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ, ఇద్దరూ తమ కెరీర్‌ను దాదాపు ఒకే సమయంలో ప్రారంభించడం,, “నేటి భారతం” చిత్రం ద్వారా స్టార్‌డమ్ సాధించడం వంటి కారణాలను సుమన్ ప్రస్తావించారు. వారి జోడీ విజయం వెనుక వారి నటన కీలకమని ఆయన అన్నారు. తనకు ఇష్టమైన పాటల గురించి మాట్లాడుతూ, “బావ బావమరిది” చిత్రం నుండి గజ్జగల్లు మన్నది, “20వ శతాబ్దం” చిత్రం నుండి అమ్మని మించిన దైవం ఉన్నదా, తన మొదటి చిత్రం “తరంగిణి” నుండి తరంగిణి ఓ తరంగిణి వంటి పాటలను తనకు ఇష్టమైన పాటలు అని అన్నారు పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Rambha : మైఖేల్ జాక్సన్ పక్కన ఉన్నా నాకు ఆ హీరోనే బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..

విజయశాంతి ఫోటో..

Vijayshanti

Vijayshanti

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *