తాజావార్తలు

Samantha: చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు.. అమ్మతనంపై సమంత కామెంట్స్ వైరల్

Samantha: చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు.. అమ్మతనంపై సమంత కామెంట్స్ వైరల్


టాలీవుడ్ హీరోయిన్ సమంత కమ్ బ్యాక్ అద్దిరిపోయింది. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను సామ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించడం విశేషం. సమంతో పాటు యాంకర్ శ్రీముఖి, గౌతమి వంటి స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సామ్‌ గురించి కొన్ని రోజులుగా ఒక రూమర్ వినిపిస్తోంది. ఆమె తల్లి కానుందని, ప్రస్తుతం గర్భంతో ఉందంటూ వార్తలొస్తున్నాయి. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ ఫోటోస్ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ, పిల్లల గురించి గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

తనకు పుట్టబోయే పిల్లల గురించి ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది సమంత. ‘నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళలంటే నాకు ఎంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు విలాసవంతమైన, లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నాకు పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు వారిని వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటాను ‘ అని సమంత చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లోనూ చీరతోనే కనిపించింది సమంత. గర్భంతో ఉండడం వల్లే ఆమె ఇలా ఈవెంట్స్‌కు హాజరయ్యారని చాలా మంది భావిస్తున్నారు. త్వరలోనే సమంత- రాజ్ గుడ్ న్యూస్‌ చెబుతారని అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో ‘మా ఇంటి బంగారం’ సినిమా యూనిట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *