తాజావార్తలు

Samantha: సమంతకు కవల పిల్లలా.? ఆ హీరోయిన్ ఒక్క కామెంట్‌తో అభిమానుల్లో కొత్త చర్చ


సమంత తన ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తన వర్కౌట్ జర్నీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు సాగిన వర్కౌట్ ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించారు. దీనికి ‘ది ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు సమంత. దీంతో అభిమానులు సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో కంటే హీరోయిన్ కృతి కర్బందా చేసిన కామెంట్‌పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. సమంత పోస్ట్‌కు స్పందించిన కృతి.. ‘సెండింగ్ ఆల్ 3 ఆఫ్ యూ సో మచ్ లవ్’ అంటూ కామెంట్ చేశారు. అంటే మీ ముగ్గురికీ ఎంతో ప్రేమను పంపిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఈ కామెంట్ కాస్త వైరల్ గా మారింది. ఇక్కడే నెటిజన్లకు ఓ సందేహం మొదలైంది. సాధారణంగా సమంత, ఆమె భర్త, పుట్టబోయే బిడ్డను కలిపి కృతి ముగ్గురికీ ప్రేమను తెలియజేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలో మరో అర్థం ఉందంటూ చర్చించుకుంటున్నారు. కృతి చేసిన ‘ఆల్ 3’ అనే పదాలను ఆధారంగా చేసుకుని సమంతకు కవల పిల్లలు పుట్టబోతున్నారేమోనని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ కామెంట్ వెనుక ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉందా.? లేక ప్రేమతో చేసిన మాములు కామెంట్ మాత్రమేనా.? అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

మొత్తానికి కృతి చేసిన ఒక్క చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఈ గాసిప్స్‌పై సమంత ఎప్పుడైనా స్పందిస్తారేమో చూడాలి.! ఇక సమంత సినిమాల విషయానికొస్తే చివరిగా మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే కృతి కర్బందా తెలుగులో పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాలో నటించి మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు కృతి కర్బందా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *