తాజావార్తలు

Ramayanam Collections: బాక్సాఫీస్ సునామీ.. రామాయణం సినిమాకు దిమ్మతిరిగే కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణం: పార్ట్ 1’. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్ నటిచడంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై రోజు రోజుకీ మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించి దూసుకుపోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ‘రామాయణం’ చిత్రం విడుదలైన మొదటి రోజు భారతదేశంలో అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా రూ. 64.85 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో రూ. 77.50 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్ కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఏకంగా రూ. 150 నుంచి రూ. 160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ. 200 కోట్లకు పైగా ప్రీ-సేల్స్ నమోదు కావడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

వివిధ భాషల పరంగా చూస్తే హిందీ వెర్షన్‌లో అత్యధికంగా రూ. 47.50 కోట్లు రాబట్టగా, కన్నడలో రూ. 7.25 కోట్లు, తెలుగులో రూ. 6 కోట్లు, తమిళం, మలయాళ భాషల్లో మిగతా వసూళ్లు నమోదయ్యాయి. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, రణ్‌బీర్ కపూర్ గత చిత్రమైన ‘యానిమల్’ తొలి రోజు ఓపెనింగ్ రికార్డులను ఈ సినిమా సునాయాసంగా వెనక్కి నెట్టింది. అయితే ప్రభాస్ ‘ఆదిపురుష్’ సాధించిన మొదటి రోజు ఓపెనింగ్ రికార్డును మాత్రం ‘రామాయణం’ అందుకోలేకపోయినప్పటికీ, సినిమాకు వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా రానున్న వారాంతంలో కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *