తాజావార్తలు

Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..


Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ యువకుడికి దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగించారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ల్ గ్రామంలో అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు భాస్కర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడు భాస్కర్ కు అరగుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేసి ఊళ్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో నడిపించుకుంటూ యువకుడు భాస్కర్ ను ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వివాహితురాలిని గత కొంతకాలంగా యువకుడు భాస్కర్ వేధిస్తున్నాడని, గతంలో అనేకమార్లు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో వివాహిత బంధువులు యువకుడు భాస్కర్ కు దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి చెప్పులు దండి వేసి మరి అవమానకర రీతిలో వీధుల్లో ఊరేగించారు.

గతంలో సదరు వివాహితురాలు యువకుడు, భాస్కర్ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో వివాహం అయింది. అయినా వివాహితురాలితో ప్రేమిస్తున్నానని వెంటపడడంతో… ఆమె భర్త వివాహితురాలిని పుట్టింట్లో వదిలి వెళ్లాడు.  తమ కూతురిని భర్త వదిలేయడానికి యువకుడు భాస్కర్ ప్రేమ వేధింపులే కారణమని ఆగ్రహంతో యువకుడు భాస్కర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అరగుండు కొట్టించి వీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పటివరకు యువకుడు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. అయినా వీడియో వైరల్ అవ్వడంతో… పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *