తాజావార్తలు
Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..!

Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..!

Highest Powerplay Score T20: పాకిస్థాన్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ న్యూజిలాండ్ ఓపెనర్ల జంట టీ20 క్రికెట్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని వినాశకర విధ్వంసం సృష్టించింది. తొలి ఆరు ఓవర్ల పవర్ ప్లే వ్యవధిలోనే ఏకంగా తొంభై రెండు పరుగులు పిండుకుని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశారు. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ తమ వీరబాదుడుతో మైదానాన్ని హోరెత్తిస్తూ పాక్ బౌలర్లకు దడ పుట్టించారు. పిచ్‌పై కివీస్ బ్యాటర్ల సింహగర్జన.. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన క్షణం తార్కాణంగా…

Read Full News
శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో మహా శివుడికి అంకితమైన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించి పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. సాధారణంగా శివలింగానికి నీరు, పచ్చిపాలు, బిల్వదళాలు, తేనె, గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఆనవాయితీ. అయితే, ఒక శివాలయంలో వీటితో పాటు శనగలను కూడా నైవేద్యంగా సమర్పించే విశిష్ట సంప్రదాయం ఉందని మీకు తెలుసా? మధ్యప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం ‘ఓంకారేశ్వర్’‌లో ఉన్న ఋణముక్తేశ్వర మహాదేవ్ ఆలయం (Rinmukteshwar…

Read Full News

పోలవరం ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినా ఆగని చిన్నారుల మరణాలు!

చింతూరు ఏజెన్సీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చిన్నారుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో, ఈ గ్రామంలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. గొల్లగుప్ప గ్రామంలో అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు…

Read Full News

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి కిందపడిన నిందితుడు హేమంత్‌!

రాప్తాడు, నవంబర్ 10: అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని పడకపై నుంచి హేమంత్ కిందపడిపోవడంతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది. హేమంత్ పడకపై నుంచి కిందపడటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని…

Read Full News
Cow: ఆవును ‘గోమాత’ అని ఎందుకు పిలుస్తారు? వేదాల్లో ఆవుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో తెలుసా?

Cow: ఆవును ‘గోమాత’ అని ఎందుకు పిలుస్తారు? వేదాల్లో ఆవుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో తెలుసా?

Cow significance in Telugu: హిందూమతంలో ఆవును కేవలం ఒక జంతువుగా చూడరు. ఆవును ‘గోమాత’గా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రాచీన కాలం నుంచే భారతీయ సంస్కృతిలో ఆవుకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. మనిషికి ఆహారం, వ్యవసాయానికి తోడ్పాటు, ఆధ్యాత్మిక ఆచారాలకు అవసరమైన పదార్థాలను అందిస్తూ గ్రామీణ జీవన విధానంలో ఆవు కీలక పాత్ర పోషించింది. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చి ఎలా పోషిస్తుందో.. అదే విధంగా ఆవు తన పాల ద్వారా…

Read Full News
ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ఇరాన్‌కు చెందిన టెహ్రాన్‌ టైమ్స్‌ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది. ‘‘ట్రంప్‌ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’’ అంటూ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్‌ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్‌…

Read Full News
ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

తమిళనాట విజయ్ చరిత్ర తిరగరాస్తారా.. డీఎంకే, అన్నా డీఎంకేకు షాక్ తప్పదా..?

తమిళనాట టీవీకే పార్టీ ఎఫెక్ట్ రెండు ప్రధాన పార్టీలకు గట్టిగానే తగిలేట్టు ఉంది. తొలిసారి బరిలో ఉన్న దళపతి విజయ్‌కు ఏమాత్రం కలిసి వస్తుంది అన్నది అలా ఉంచితే, ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు మాత్రం గట్టి దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సర్వేలు తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు తప్పదని సూచిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొత్తగా పార్టీ విజయ్ వైపు వెళితే, అది అన్నాడీఎంకేకు కలిసి రావాలి.. కానీ తమిళనాట అది…

Read Full News
రూ.18 లక్షల కోట్ల డీల్‌..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్‌..!

రూ.18 లక్షల కోట్ల డీల్‌..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్‌..!

ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్‌ డాలర్లకు రెట్టింపు చేయాలనే ప్రణాళిక, పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, విస్తరణలో సహకారం వంటివి ఉన్నాయి. అలాగే 2026లో ప్రారంభించబోయే రెండవ మౌలిక సదుపాయాల నిధిలో పాల్గొనడాన్ని పరిశీలించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, UAE సావరిన్ వెల్త్ ఫండ్‌ను ఆహ్వానించారు. యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్…

Read Full News

11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోక్సో కేసు!

కేరళలో మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ మీడియా మహిళా  ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. త్రిస్సూర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలిపై త్రిస్సూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (POCSO Act) కింద వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలుడిపై నిందితురాలు లైంగిక దాడికి పాల్పడినట్లు…

Read Full News

500 మందికి పులిహోర చేయాలా? గణపతి భోజనాల్లో ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!

ముందుగా, 250 గ్రాముల చింతపండును తీసుకోవాలి. దీనిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి తీసుకుని, చింతపండు మునిగేంతవరకు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు, కేవలం మునిగితే సరిపోతుంది. ఇలా కడిగిన చింతపండును ఒక గంట సేపు నానబెట్టాలి. త్వరగా నానాలంటే వేడి నీళ్లు వాడవచ్చు. ఆ తర్వాత, గిన్నెను స్టవ్‌పై పెట్టి, ఐదారు నిమిషాలు వేడి చేయాలి. ఉడకడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారాక,…

Read Full News