తాజావార్తలు
వైద్య రంగంలో అద్భుతం..! అవయవ మార్పిడి అవసరం లేని సరికొత్త ప్రయోగం

వైద్య రంగంలో అద్భుతం..! అవయవ మార్పిడి అవసరం లేని సరికొత్త ప్రయోగం

కృత్రిమ శ్వాసనాళం తయారీలో శాస్త్రవేత్తలు అత్యాధునిక విధానాన్ని అనుసరించారు. ముందుగా రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా బయోడీగ్రేడబుల్ స్కాఫోల్డ్‌తో శ్వాసనాళాన్ని నిర్మించారు. ఆ స్కాఫోల్డ్‌పై రోగికి చెందిన మూలకణాలను నాటారు. కాలక్రమేణా ఆ కణాలు అభివృద్ధి చెంది జీవ కణజాలంగా మారాయి. ఈ క్రమంలో స్కాఫోల్డ్ నెమ్మదిగా కరిగిపోయి, చివరకు పూర్తిగా సహజమైన శ్వాసనాళం మిగిలిపోయింది. ఇది పూర్తిగా రోగి సొంత కణాలతో తయారైనది కావడంతో, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దీనిని తిరస్కరించే ప్రమాదం ఉండదు….

Read Full News
Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీయిటెల్స్!

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీయిటెల్స్!

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఈసారి హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని మంగళూరు మధ్య నడిపిన ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన (రెస్పాన్స్) వచ్చింది. అలాగే ఈ రూట్‌లో సేవులను మరికొంత కాలం…

Read Full News

Electric Blankets: ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!

Electric Blankets: వేసవిలో ఏసీ లేదా కూలర్ లేకుండా నిద్రపోవడం ఎంత కష్టమో, శీతాకాలంలో చల్లటి పడక కూడా నిద్రను సవాలుగా మారుస్తుంది. మరి శీతాకాలం కూడా ప్రారంభమైపోయింది. మీరు చల్లటి పడక సమస్యను వదిలించుకోవాలనుకుంటే, ఎలక్ట్రిక్ బ్లాంకెట్ సహాయపడుతుంది. మీరు ఎలక్ట్రిక్ బ్లాంకెట్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ముందుగా దాని గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం. దీన్ని ఎలా ఉపయోగించాలి? మీ పడకను వెచ్చగా ఉంచుకోవడానికి పడుకునే ముందు 15-20 నిమిషాల ముందు…

Read Full News
త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మరో ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ సందడి చేయబోతోంది. ఫైర్-బోల్ట్ సంస్థ తన కొత్త ‘బోల్ట్’ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎవో, ఏస్ సిరీస్‌లలో రానున్న ఈ కొత్త ఫోన్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్ పరికరాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్-బోల్ట్ సంస్థ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ‘బోల్ట్’ అనే పేరుతో…

Read Full News

ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోండి!

ముఖ్యంగా హీల్స్ ఎత్తు, వాటి డిజైన్‌, ఎంతసేపు ధరిస్తున్నారనే అంశాలు శరీరంపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. హైహీల్స్ ధరించినప్పుడు పాదాల సహజ స్థితి మారుతుంది. శరీర బరువు పాదాల ముందు భాగంపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా ఎత్తైన, సన్నని హీల్స్ ధరించినప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం కొంత కష్టమవుతుంది. దీనివల్ల నడిచేటప్పుడు కండరాలు, కీళ్లు అదనంగా పనిచేయాల్సి రావచ్చు. అంతేకాకుండా, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లు, మెట్లు, జారే నేలలపై హైహీల్స్‌తో నడవడం వల్ల పాదం బెణకడం, తడబడటం…

Read Full News
Nalgonda: కారు డ్రైవర్ చిన్న మిస్టేక్.. బలైన దంపతులు..

Nalgonda: కారు డ్రైవర్ చిన్న మిస్టేక్.. బలైన దంపతులు..

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన దంపతులు తల్లం పుల్లయ్య(63), తల్లం పద్మ(55) గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో వారిని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు.పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, చిన్న కుమారుడు శివ మిర్యాలగూడలో ఉంటున్నాడు. నెల రోజుల క్రితం దంపతులు బైక్‌పై మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా తుంగపహాడ్ వద్ద వీరి వాహనాన్ని.. ఓ కారు…

Read Full News
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

Social Media Danger: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం నేటి తరం కుర్రకారు ఏ స్థాయికి దిగజారుతుందో, ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతుందో చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. అప్పటివరకు కళ్లముందే నవ్వుతూ పని చేసుకున్న ఇద్దరు కూలీలు, కేవలం ఒకే ఒక్క వీడియో మోజులో పడి అనంత లోకాలకు వెళ్లిపోయిన తీరు స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీలు.. కడప జిల్లా…

Read Full News
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఒక వస్త్ర దుకాణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ అనూహ్య పరిణామాలకు దారితీసింది. రూ.5000 ఖరీదు చేసే చీరను కేవలం రూ.600కే అందిస్తామని, అది కూడా ఒక్కరోజు మాత్రమేనని దుకాణం యాజమాన్యం ప్రకటించడంతో భారీ సంఖ్యలో మహిళలు షాప్‌కు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో షాప్ ఓపెనింగ్ రోజున మహిళల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read Full News

మీ ఇంట్లో రోజూ 10 గంటలు లైట్లు వేస్తే ఎంత కరెంట్ బిల్లు వస్తుందంటే..? ఈ లెక్క తెలుసుకోండి..

ప్రస్తుతం ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఎల్ఈడీ బల్బులు ఉపయోగిస్తున్నారు. సాధారణ లైట్లతో పోలిస్తే ఎల్‌ఈడీ బల్బులు అనేవి తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుతురును అందిస్తాయి. దీంతో విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో ఎల్ఈడీ లైట్లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే మెరుగైన ఎల్‌ఈడీ బల్బులు లభిస్తున్నాయి. దీంతో ఈ బల్బులు ఎంతసేపు వాడినా తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ బల్బుల వాటేజ్, వినియోగం సమయం, ఇంట్లోని లైట్ల సంఖ్యను…

Read Full News