తాజావార్తలు
కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?

కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?

దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. కొబ్బరికాయలు ముడుపు కట్టడం, బంగారం వెండి కానుకలు సమర్పించడం చూస్తుంటాం.. సమ్మక్క-సారక్క దేవతలకైతే బెల్లం మహా నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం రాచగుమ్మడికాయలే మహా నైవేద్యం.. కోటీశ్వరులైనా.. కటిక పేద భక్తులైనా, ఎంతటివారైనా సరే ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని రావాల్సిందే..! కొత్తకొండ వీరభద్రస్వామి కి మొక్కులు మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచగుమ్మడికాయ…

Read Full News
పాదాల పగుళ్లను చిటికెలో నయం చేసే ఇంటి చిట్కాలివో..

పాదాల పగుళ్లను చిటికెలో నయం చేసే ఇంటి చిట్కాలివో..

శీతాకాలం పొడి వాతావరణంలో మడమలు పగుళ్లు ఏర్పడటం సాధారణ సమస్య. ఈ సమస్యను విస్మరించడం వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ప్రధానంగా చర్మంలో తేమ లేకపోవడం వల్ల వస్తుంది. దీని కోసం రాత్రి పడుకునే ముందు ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానికి కొంచెం సముద్రం ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత మీ పాదాలను ఈ నీటిలో 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఇది మృత కణాలను మృదువుగా చేసి తొలగించడం సులభం…

Read Full News
ఇది కదా మార్పు అంటే.. మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

ఇది కదా మార్పు అంటే.. మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇటీవల విడుదలైం ఆ రాజు వెడ్స్ రాంబాయి, దండోరా సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. కొత్త హీరోలు, కొత్త దర్శకులు మంచి లవ్ స్టోరీస్ ను తెరకెక్కిస్తున్నారు. గతంలోనూ అలాంటి సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో మేం…

Read Full News
Andhra: అసలే సంక్రాంతి.. కోడి పుంజు ఫ్రీ అంటే.. పెద్ద ఆఫరేగా మరి

Andhra: అసలే సంక్రాంతి.. కోడి పుంజు ఫ్రీ అంటే.. పెద్ద ఆఫరేగా మరి

గోదావరి జిల్లాలలో సంక్రాంతి అంటేనే ఓ ప్రత్యేకత సాంప్రదాయం. కోడి పందాలు, బంధువులు, కొత్తల్లుళ్ల రాకతో సందడి సందడిగా ఉంటుంది. వచ్చే అతిధులకు మర్యాదల్లో రాజీ పడకుండా రకరకాల వంటకాలు ఒడ్డిస్తుంటారు. ఈ పండుగకు స్తోమత లేకపోయినా అప్పు చేసిన ముక్కనుమ రోజున నాటు కోడి కోస్తారు. అయితే ఈసారి కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొందామన్న దొరకని పరిస్థితి. దీన్ని గుర్తించిన ఓ ఎలక్ట్రానిక్ షాపు వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. తమ షాపులో 10,000 దాటి…

Read Full News
Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

దొంగతనం ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి కొందరు దుండగులు ఆలయంలో చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్థరాత్రి గుడిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు… వాళ్ల నుంచి రూ.26 లక్షల బంగారం, వెండి ఆభరణాలతో పాటు, రెండు బైక్స్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం.. కూకట్ పల్లీలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో…

Read Full News
Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లే..!

Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లే..!

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తంలోని వ్యర్థాలను, శరీరానికి అవసరం లేని ఖనిజాలను మూత్రం ద్వారా బయటకు పంపి, స్వచ్ఛమైన రక్తాన్ని శరీరమంతటా పంపిణీ చేస్తాయి. అయితే, మన జీవనశైలి, తీసుకునే ఆహారం, అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, అనవసరంగా ట్యాబ్లెట్లు మింగడం, ఇతర ఆరోగ్య సమస్యలు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి. కిడ్నీ పనితీరు మందగించి, శరీరంలోని వ్యర్థాల తొలగింపు విధులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు పలు రకాల కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం…

Read Full News
తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల దగ్గర పందెం రాయుళ్లు, వీక్షకులతో సందడి వాతావరణం నెలకొంది. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతంలో లాగే ఈ సారీ కూడా కోట్ల రూపాయలు…

Read Full News
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 15, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు మంచి గుర్తింపు…

Read Full News
Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

పల్లెటూర్లలో పండగలప్పుడు బరువులు ఎత్తడం, తాడు లాగడం, కొబ్బరికాయ విసరడం వంటి పందాలు నిర్వహిస్తూ ఉంటారు .అలానే ఎడ్లతో బండలు లాగించడం, పరిగెత్తించడం వంటి పందేల చూస్తూ ఉంటాం.. ఇక గుర్రాల రేసులు, బైక్ రేసులు, కార్ రేసులు కూడా సిటీల్లో చూస్తూ ఉంటాం. ఇలా పందేలు ఏవి చూసినా ముందుకు వెళ్లడమే టార్గెట్. బైక్స్, కార్ రేసింగ్స్ ఏవైనా ఆయా వాహనాలు మంచి కండీషన్‌లో ఉంటే ముందకు ఎవరైనా నడిపిస్తారు. కానీ రివర్స్ నడపడం అంటే…..

Read Full News
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి…! మీ ఆరోగ్యానికి దిక్సూచి.. లాభాలు తెలిస్తే..

ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి…! మీ ఆరోగ్యానికి దిక్సూచి.. లాభాలు తెలిస్తే..

ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ శీతాకాలపు అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భారీ శీతాకాలపు ఆహారాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముల్లంగి టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడేలా చేస్తుంది. సహజ నిర్విషీకరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది. కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగిలో అధిక నీటి శాతం చర్మాన్ని తేమగా ఉంచుతుంది….

Read Full News