కంటి చూపును మెరుగు పరిచే రుచికరమైన క్యారెట్ పప్పు.. అన్నం, చపాతీల్లోకి అదుర్స్
కావలసిన పదార్థాలు: అర కప్పు కందిపప్పు , 2 కప్పుల నీళ్లు, 2 మీడియం సైజు తాజా క్యారెట్లు, ముక్కలుగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 7 నుండి 8 ఎండు మిరపకాయలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ వంట నూనె, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు తయారీ విధానం: కుక్కర్‌లో అర కప్పు కందిపప్పును వేసి నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కందిపప్పు కొలిచిన కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇందులో పెద్ద ముక్కలుగా కట్…
