మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకొని తగలబడిపోతోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా, అందులో ఉన్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు వచ్చిన ఆ పాము, మంటల…
