తాజావార్తలు

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం!

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు…

Read More
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం!

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం!

గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు మైమరపించే వార్త లభించింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా…

Read More
Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్‌.. ఎందుకంటే

Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్‌.. ఎందుకంటే

చిన్న గొడవ కారణంగా ఓ ఫుడ్‌ డెలివరీ భాయ్‌ను పోలీస్ కానిస్టేబుల్‌ కాల్చిన చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకలోని జాఫర్‌పూర్ కలాన్ ప్రాంతంలో రూపేష్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి వచ్చిన వ్యక్తులంతా కేక్‌ కటింగ్ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు.కొందు క్యాబ్‌ కోసం వెయిట్ చేస్తుండగా, మరికొందరు బైక్‌పై నిల్చొని మాట్లాడుతున్నారు. ఇంతలో అదే కాలనీలో నివాసం ఉంటున్న…

Read More
ఆరోగ్యకరమైన కరివేపాకు నిలవ పచ్చడి.. కమ్మగా భలే రుచిగా ఉంటుంది

ఆరోగ్యకరమైన కరివేపాకు నిలవ పచ్చడి.. కమ్మగా భలే రుచిగా ఉంటుంది

ఆరోగ్యకరమైన, రుచికరమైన కరివేపాకు నిల్వ పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.  ఈ చట్నీ అన్నం, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ తో పాటు అద్భుతమైన రుచిని అందిస్తుంది. సరైన కొలతలతో, చిట్కాలతో చేస్తే మొదటిసారి చేసేవారు కూడా దీన్ని విజయవంతంగా తయారు చేయగలరు. తయారీ విధానం: ముందుగా కరివేపాకు నిల్వ పచ్చడికి అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఐదు కప్పుల (దాదాపు 100 గ్రాముల) కరివేపాకును శుభ్రంగా కడిగి, పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా…

Read More

Video: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా ఫ్యాన్స్.. 100 ఏళ్లైనా గుర్తుండిపోయే ఐకానిక్ మూమెంట్ మీకోసం..!

Rohit Sharma Century Celebrations: గువాహటిలో రోహిత్ శర్మ చేసిన సెంచరీ ఎంత ప్రత్యేకమో, దాని తర్వాత కనిపించిన సెలబ్రేషన్ కూడా అంతే ప్రత్యేకంగా మారింది. వెస్టిండీస్‌పై రెండో వన్డేలో రోహిత్ 75 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పరుగు చేస్తున్న క్రమంలో మార్చ్ ఫాస్ట్ చేస్తూ పరిగెత్తాడు. క్రీజులో చేరిన వెంటనే చేతితో పంచ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ చూసిన ఫ్యాన్స్‌కు పూనకాలు…

Read More

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్, పెన్షన్ అమౌంట్ విత్ డ్రా కోసం సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. ఉద్యోగం మానేశాక కేవలం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మాత్రమే ఉపసంహరించుకోగలరు. మిగతా 25 శాతం తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు ఆగాల్సింది….

Read More

మమత బెనర్జీకి బిగ్ షాక్..! TMC పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం..!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై మమతా బెనర్జీ, రీటాబ్రత బెనర్జీ వర్గాలు పోటీగా హక్కులు కోరుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం మధ్యంతర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రెండు వర్గాలూ TMC పేరు, అధికారిక ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు…

Read More
పీరియడ్స్ మొదలైన అమ్మాయిలు తప్పనిసరిగా ఇది తినండి అమ్మా.. ఆరోగ్యానికి చాలా మంచిది..

పీరియడ్స్ మొదలైన అమ్మాయిలు తప్పనిసరిగా ఇది తినండి అమ్మా.. ఆరోగ్యానికి చాలా మంచిది..

ఆడపిల్లలలో పీరియడ్స్ మొదలైన తర్వాత వారి ఆరోగ్యం, బలం చాలా ముఖ్యం. నడుము, ఎముకలు దృఢంగా ఉండటానికి, పీరియడ్స్ వల్ల వచ్చే రక్తహీనతను పోగొట్టి ఆరోగ్యంగా ఉండటానికి పూర్వ కాలంలో మన పెద్దలు ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసే ఒక తియ్యటి, బలవర్ధకమైన వంటకం సున్ని సంగటి. ఈ సాంప్రదాయ వంటకం ఆడవారికి మాత్రమే కాకుండా ఇంట్లో అందరూ తినదగినది. సున్ని సంగటి తయారీకి కావలసిన పదార్థాలు, వాటి తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది. ముందుగా,…

Read More
పాఠశాలలో కామాంధుడి ఘాతుకం.. ఆరేళ్ల చిన్నారిపై టాయిలెట్ అటెండెంట్ లైంగిక దాడి..!

పాఠశాలలో కామాంధుడి ఘాతుకం.. ఆరేళ్ల చిన్నారిపై టాయిలెట్ అటెండెంట్ లైంగిక దాడి..!

పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో పసిమొగ్గపై జరిగిన లైంగిక దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల అమాయక చిన్నారిపై పాఠశాల ఆవరణలోనే బాయ్స్ టాయిలెట్ అటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్, తోటి ఉపాధ్యాయులు ప్రయత్నించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జూలై 10 (శుక్రవారం) నాడు ఆరేళ్ల చిన్నారి ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్ళింది. స్కూల్ ముగిసిన తర్వాత…

Read More
ORRపై ఘోర ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నటుడు భరత్ కాంత్‌తో పాటు మరొకరు మృతి!

ORRపై ఘోర ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నటుడు భరత్ కాంత్‌తో పాటు మరొకరు మృతి!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం (మే 10) అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో సినీ నటుడు కత్తి భరత్ కాంత్ (31) తోపాటు అతని స్నేహితుడు గూడ సాయి త్రిలోక్ (31) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. భరత్ కాంత్, సాయి…

Read More