ప్చ్.. సిగరెట్ కాలుస్తున్నారా..? తండ్రి కావడం కష్టమేనట.. నిమ్స్ వైద్యుల పరిశోధనలో సంచలన విషయాలు
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ల మీద ఎంత పెద్ద అక్షరాలతో రాసినా స్మోకర్స్ అస్సలు పట్టించుకోరు.. గుండె, ఊపిరితిత్తులు పాడవుతాయని మాత్రమే చాలామంది అనుకుంటారు. కానీ, సిగరెట్ అలవాటు మగవారిని తండ్రులు కాకుండా చేసే ప్రమాదం ఉందనే షాకింగ్ విషయాన్ని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పొగతాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు.. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోని IVF సెంటర్‌లో తెలుగు రాష్ట్రాల వైద్యులు నిర్వహించిన…
