Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశాలు జరగనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యం కార్యక్రమాల్లోనూ నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు…
