Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..
నటుడు ఛత్రపతి శేఖర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, విడాకులు, సినీ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక అలవాట్లపై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తనకు వివాహమైందని, ఆ సమయంలో తన సంపాదన తక్కువగా ఉండేదని వెల్లడించారు. సినీ రంగంలో గుర్తింపు వచ్చాక, బిజీ అయ్యాక కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయని, ఇది విడాకులకు దారితీసిందని వివరించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమేనని, ఒకరినొకరు నిందించుకోవడం, రోజూ కొట్లాడుకోవడం కంటే దూరం ఉండడమే…
