Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కల్లుగీత కార్మికుడిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. కల్లు సేకరించే మండువాలోనే రక్తపు మడుగులో పడి విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్కతుర్తికి చెందిన విజయ్ కళ్యాణ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో.. అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో…
