తాజావార్తలు
Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు కేవలం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలోనే కనిపించే ట్రాఫిక్ రద్దీ, ఇప్పుడు ప్రతి వారాంతంలోనూ (వీకెండ్) సర్వసాధారణమైపోయింది. అసంపూర్తిగా సాగుతున్న నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఈ కీలక రహదారిపై ప్రతిరోజూ సగటున 50,000 పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది….

Read More
Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

హైదరాబాద్‌, మే 28: తల్లి మరణించి 2 నెలలు కూడా తిరక్కుండానే ఆ ఇంట మరో మరణం కలవరం రేపింది. తల్లి మరణం జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరిని వీడి ఒకరు ఉండలేక వరుసగా తల్లీకుమారుడు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని మార్కండేయ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవపల్లి ప్రాంతంలోని నివాసం ఉంటున్న కొముర రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి తల్లి సుమారు రెండు…

Read More
ప్రజల్లోకి చిట్టి వచ్చేస్తోందా..! యూబీటెక్ నుంచి అదిరిపోయే ‘UWORLD U1’ ఆవిష్కరణ!

ప్రజల్లోకి చిట్టి వచ్చేస్తోందా..! యూబీటెక్ నుంచి అదిరిపోయే ‘UWORLD U1’ ఆవిష్కరణ!

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పరిశ్రమలలో ప్రమాదకరమైన, యాంత్రికమైన పనులకే పరిమితమైన రోబోలు, ఇప్పుడు మన ఇళ్లలోకి, మన తోడుగా రావడానికి సిద్ధమయ్యాయి. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘యూబీటెక్’ (UBTech) మనుషులతో స్నేహపూర్వకంగా ఉండేలా రూపొందించిన ‘UWORLD U1’ అనే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ఫ్యాక్టరీ పనుల కోసం కాకుండా, కేవలం మనుషులకు తోడుగా ఉండేందుకు, భావోద్వేగాలను పంచుకునేందుకు దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మనిషి రూపంతో, సిలికాన్ చర్మంతో, తెలివైన ఎమోషనల్…

Read More
Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా సన్నాహకాల్లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 2) ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. యువ సంచలనం తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం, ఐపీఎల్ స్పీడ్ స్టార్ మయూంక్ యాదవ్ జట్టులోకి రావడం ఈ స్క్వాడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం…

Read More
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది నగల వ్యాపారులు వెండి, బంగారం, వజ్రాల ఆభరణాలపై తగ్గింపులను అందిస్తున్నారు. తేలికపాటి ఆభరణాలు, కొత్త ఎంపికలకు డిమాండ్: గతంలో ప్రజలు పెద్దగా ఆలోచించకుండా బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులలో అవగాహన పెరిగింది. ముఖ్యంగా యువ వినియోగదారులు బరువైన ఆభరణాల కంటే తేలికైన,…

Read More
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..

వంశీ సినిమాల్లో హీరోయిన్ల కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా భానుప్రియ కళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, తన చిన్నతనంలో తన ఊరిలో ఒక నర్సును చూసేవాడినని, ఆమె కళ్ళు చాలా అందంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించిన తర్వాత, మళ్ళీ అలాంటి కళ్ళను మద్రాసులో భానుప్రియలో చూశానని, అందుకే ఆమెను తన సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకున్నానని వెల్లడించారు. తన సినిమాల్లో స్త్రీ పాత్రలను ఎంతో గౌరవంగా, పద్ధతిగా చూపిస్తానని వంశీ గారు తెలిపారు….

Read More
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..! అసలు నిజాలు ఇవే..

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..! అసలు నిజాలు ఇవే..

బరువు తగ్గడానికి బెస్ట్ ఛాయిస్: గుడ్లు ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప సహజ వనరు. ఒక పూర్తి గుడ్డులో సుమారు 6 గ్రాముల అత్యంత నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు అస్సలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కాకుండా గుడ్డు సొనలో మెదడు అభివృద్ధికి, కండరాల పనితీరుకు అవసరమైన కోలిన్, నాడీ వ్యవస్థను రక్షించే విటమిన్ బి12, కంటిచూపును మెరుగుపరిచే ల్యూటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు…

Read More
Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల…

Read More
Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారామె. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటిగా, కమెడియన్ గా నటించిన ఆమె ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. అనారోగ్య సమస్యలకు తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శ్యామల. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని కూతురు చికిత్సకే ఖర్చు పెట్టడంతో ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇద్దరూ వృద్ధాశ్రమంలోనే గడుపుతున్నారు. దీనికి తోడు వీరి మందుల కోసం ప్రతి…

Read More
Astrology: శివుడి ప్రత్యేక కటాక్షం ఉన్న 5 రాశులు ఇవే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

Astrology: శివుడి ప్రత్యేక కటాక్షం ఉన్న 5 రాశులు ఇవే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

వృశ్చికం (లోతైన ఆలోచన, ఆధ్యాత్మిక శక్తి): వృశ్చికరాశి వారు అంతర్ముఖ స్వభావం, మానసిక దృఢత్వం, రహస్యాలను అర్థం చేసుకునే సామర్థ్యంతో ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. కష్టాలను తట్టుకునే శక్తి, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రతీకార భావాన్ని విడిచిపెట్టి ధ్యానం, శివారాధన వైపు మళ్లితే జీవితంలో మరింత శాంతి, ఆత్మబలం లభిస్తుందని చెబుతారు.

Read More