తాజావార్తలు

Indian Railways: ట్రైన్ కోచ్‌లపై ఐదు అంకెల నెంబర్లు ఎందుకుంటాయి..? నెంబర్ల వెనుక అసలు రహస్యం ఇదే..

Indian Railways: ట్రైన్ కోచ్‌లపై ఐదు అంకెల నెంబర్లు ఎందుకుంటాయి..? నెంబర్ల వెనుక అసలు రహస్యం ఇదే..


రైళ్లకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక నెంబర్లు, అక్షరాలు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి. ట్రైన్ల బోగీలపై కనిపించే నెంబర్లు, సింబల్స్, బోర్డుల గురించి చాలామందికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. కొంతమంది వీటిని పట్టించుకోరు. కానీ కొంతమందికి వీటి వెనుక అర్థం ఏంటనేది తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీరు ట్రైన్ల బోగీలను చూస్తే ప్రతీ కోచ్‌పై ఒక ప్రత్యేకమైన నెంబర్ ఉంటుంది. ఒక్కొ బోగీపై ఒక్కో ఐదు అంకెల నెంబర్ ఉంటుంది. దీనికి అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదు అంకెలు ఎందుకు..?

రైలు బోగీలపై ఐదు నెంబర్లతో కూడిన ఒక ప్రత్యేకమైన నెంబర్ ఉంటుంది. రైలు బోగీ ఎప్పుడు తయారైంది.. ఏ రకమైన బోగీ అనే సమాచారం దీని గురించి తెలుసుకోవచ్చు. నెంబర్‌ను రెండు పార్టులుగా విభజించడం వల్ల దాని వెనక ఉన్న అర్థం తెలుసుకోవచ్చు. మొదటి రెండు నెంబర్లు బోగీ ఏ సంవత్సరంలో తయారు చేశారు అనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు 97208 అని నెంబర్ ఉంటే.. 1997లో తయారుచేశారని అర్థం. ఇక 05497 అని ఉంటే 2025లో తయారైందని అర్ధం. ఇక చివరి మూడు అంకెల విషయానికొస్తే.. అవి టైప్ ఆఫ్ బోగీని సూచిస్తాయి. అంటే జనరల్, ఏసీ కోచ్‌, స్లీపర్ కోచ్‌లను సూచిస్తుంది. ఉదాహరణకు చివరి మూడు అంకెలు 001 నుంచి 200 మధ్యలో ఉంటే ఏసీ క్లాస్ బోగీ అని అర్థం.

సులువుగా గుర్తించొచ్చు..

ఇక 200 నుంచి 400 మధ్యలో ఉంటే స్లీపర్ క్లాస్ కోచ్‌గా చెప్పుకొవచ్చు. ఇక 400 నుంచి 600 మధ్యలో ఉంటే జనరల్ కోచ్ అని అర్థం. ఇక 600 నుంచి 700 మధ్యలో ఉంటే సెకండ్ క్లాస్ కోచ్‌గా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ త్రీ డిజిట్స్ 800 కంటే ఎక్కువగా ఉంటే అది మెయిల్, జనరేటర్, ప్యాంట్రీ కోచ్ అని అర్థం. రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారు వీటి గురించి తెలుసుకోవడం వల్ల మీ ప్రయాణం సులభతరం అవుతుంది. కోచ్‌లను సులువుగా గుర్తు పట్టవచ్చు. దీని ద్వారా వేగంగా బోర్డింగ్ అవ్వొచ్చు. వీటిని తెలుసుకోవడం వల్ల ప్రయాణికులకు చాలా ఉపయోగం ఉంటుంది. కానీ చాలామంది ఈ నెంబర్ల గురించి అసలు పట్టించుకోరు. ఇంకా ట్రైన్ బోగీలపై కనిపించే సింబల్స్ వెనుక అనేక అర్ధాలు ఉంటాయి. ట్రైన్ చరిత్రను మనం ఈ నెంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. రైళ్ల గురించి సమాచారం తెలుసుకునేందుకు, భద్రతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *