నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
ఆధునిక జీవనశైలిలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అయితే, మన పెరట్లో లేదా పల్లెటూరి పొలాల గట్లపై కనిపించే 'నల్లేరు' ఈ సమస్యలన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్లేరుకు 'అస్థిసంహారక' అనే పేరు ఉంది. ఎముకలు విరిగినప్పుడు ఆ కణజాలం త్వరగా పునరుత్పత్తి చెందడానికి ఇది దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం, కార్బోనేట్ మూలకాలు ఎముకలను వజ్రం వలె దృఢంగా మారుస్తాయి. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఎముకల…
