వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
మన జాతీయ పక్షి, భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే నెమళ్లు.. ఒక దేశంలో మాత్రం అక్కడి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారాయి. ఇటలీలోని ‘పుంటా మెరీనా’ అనే చిన్న తీరప్రాంత పట్టణంలో వందలాది నెమళ్లు సృష్టిస్తున్న గందరగోళం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇవి రోడ్లపై గుంపులుగా తిరుగుతూ ట్రాఫిక్‌ను అడ్డుకోవడం, పార్క్ చేసిన కార్ల అద్దాలపై దాడి చేయడం, అర్ధరాత్రి వేళల్లో పెద్దగా అరుస్తూ నిద్ర లేకుండా చేస్తుండటంతో ప్రజలు విసిగిపోతున్నారు. కొన్ని సంవత్సరాల…
