డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండల కేంద్రంలో మహిళ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఓ మహిళ మరో మహిళను అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు జులై 21న పెద్దారవీడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో…
