టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
Fatima Sana World Record: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా సరికొత్త చరిత్ర సృష్టించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చడమే కాకుండా, ఒకే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మహిళా కెప్టెన్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టు టోర్నీలో ఘనమైన ముగింపును పలకడమే కాకుండా తొలి విజయాన్ని నమోదు చేసింది. దిగ్గజాలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి…..
