సౌతిండియన్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మూకుత్తి అమ్మన్ 2’ ( తెలుగులో మహాశక్తి) . సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2020లో రిలీజై సంచలన విజయం సాధించిన మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది) సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.
మొదటి పాత్రలో అమ్మవారి పోషించిన నయనపాత్రనే మళ్లీ ఇప్పుడు ఈ సీక్వెల్ లో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతారతో పాటు దునియా విజయ్, యోగి బాబు, రెజీనా కస్సాండ్రా, ఊర్వశి, సునీల్, అభిదయ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్ పై డాక్టర్ ఇషారీ గణేష్ సుమారు రూ.100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకన్న ఈ మహాశక్తి సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది
కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందు నయనతార ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపించింది నయన్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా మహా శక్తి సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తోంది. హిప్హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా మూకుత్తి అమ్మన్ తో పాటు నయనతార చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఒక హిందీ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.





