తాజావార్తలు

Nagabandham: నాగబంధం సినిమాలో విల‌న్‌గా అదరగొట్టిన రిషబ్ సాహ్నీ.. ఇంతకీ ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

Nagabandham: నాగబంధం సినిమాలో విల‌న్‌గా అదరగొట్టిన రిషబ్ సాహ్నీ.. ఇంతకీ ఈ నటుడు ఎవరో తెలుసా.. ?


ప్రస్తుతం థియేటర్లలలో దూసుకుపోతున్న చిత్రాల్లో నాగబంధం ఒకటి. టీజర్, ట్రైలర్ ద్వారానే విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు అందరినీ విశేషంగా ఆకర్షించిన పాత్ర మెగా విలన్ ‘అబ్దాలీ’. ఈ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు రిషబ్ సాహ్నీ అద్భుతమైన నటన కనబరిచారు. ప్రస్తుతం అతడి గురించి నెట్టింట విపరతీమైన టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో రిషబ్ సాహ్నీ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ , డామినేటింగ్ ఆరా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన నటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో, 1700 కాలం నాటి ముస్లిం రాజుగా ఆయన కనబరిచిన హావభావాలు, క్రూరత్వం నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

ఈ సినిమాలో రిషబ్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ థియేటర్లలో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంటుందని, కథను మలుపు తిప్పేలా ఆయన పాత్రను డిజైన్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ రిషబ్ సాహ్నీ ఎవరంటే.. ఆయన బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. గతంలో హిందీలో ‘ది ఎంపైర్’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌తో పాటు, హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ఫైటర్’లో కూడా కీలక పాత్రలో నటించారు. ‘నాగబంధం’ సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టారు. మొదటి తెలుగు సినిమాతోనే విలనిజంలో తనదైన ముద్ర వేసి టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించారు.

ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్ వంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ, రిషబ్ సాహ్నీ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో విలన్ పాత్రల కొరతను తీర్చేలా రిషబ్ రూపంలో ఒక మంచి నటుడు దొరికాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో టాలీవుడ్ దర్శకులు ఆయన కోసం మరిన్ని పవర్‌ఫుల్ పాత్రలను సృష్టిస్తారని అంటున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

రిషబ్ సాహ్నీ ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *