Multibagger Stock: స్టాక్ మార్కెట్లో ఓపిక ఉన్న ఇన్వెస్టర్లకు అదృష్టం ఎలా వరిస్తుందో చెప్పడానికి ఈ స్టాక్ ఒక నిదర్శనం. పెన్నీ స్టాక్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఐదేళ్ల కాలంలో కళ్లు చెదిరే లాభాలను పంచిన కంపెనీ – నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Nurture Well Industries Ltd).
ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా!
కళ్లు చెదిరే రిటర్న్స్:
ఐదేళ్ల క్రితం ఈ షేర్ ధర కేవలం 14 పైసలు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ స్టాక్ 35 రూపాయల స్థాయికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ షేర్ ఏకంగా 24,970% కంటే ఎక్కువ రిటర్న్స్‌ను అందించింది. ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు దాని విలువ దాదాపు రూ. 2.50 కోట్లు అయ్యేది.
ఇవి కూడా చదవండి
షేర్ పర్ఫార్మెన్స్:
నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం రూ. 35 సమీపంలో ట్రేడవుతోంది. 52 వారాల గరిష్టం: ఫిబ్రవరి 17, 2026న ఈ షేర్ రూ. 46 వద్ద తన 52 వారాల గరిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ 2025లో ఈ షేర్ రూ. 17 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది.
స్టాక్ స్ప్లిట్, బోనస్: 2024 సంవత్సరంలో ఈ కంపెనీ ఒక షేరును 10 ముక్కలుగా విభజించడంతో పాటు (Stock Split), ప్రతి ఒక షేరుకు ఒక బోనస్ షేరును (Bonus Issue) కూడా ప్రకటించింది.
షేర్ హోల్డింగ్ లో మార్పులు:
FY26 మార్చి త్రైమాసిక నివేదిక ప్రకారం: 53.81 శాతం వాటాతో ప్రమోటర్లు స్థిరంగా ఉన్నారు. FIIs (విదేశీ ఇన్వెస్టర్లు): వీరి వాటా 4.25% నుండి 0.18% కి పడిపోయింది.
పబ్లిక్ షేర్ హోల్డింగ్: సామాన్య ఇన్వెస్టర్ల వాటా 41.86% నుండి 45.94% కి పెరిగింది. ఇది కంపెనీపై రిటైల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సూచిస్తుంది.
యాజమాన్యంలో మార్పులు:
కంపెనీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అనిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో శీతల్ సోనీని కొత్త CFOగా నియమించారు. ఏప్రిల్ 21, 2026 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది.
త్రైమాసిక ఫలితాలు:
FY26 డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 290 కోట్లుగా నమోదైంది. నికర లాభం రూ. 31 కోట్లుగా ఉండగా, ప్రతి షేరుపై ఆదాయం (EPS) 1.06 రూపాయలకు పెరిగింది.
ఇది కూడా చదవండి: Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో రూ.6000.. రైతుల కోసం దరఖాస్తులు షురూ.. ఇలా చేసుకోండి..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
