తాజావార్తలు

LPG Gas Price: బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందంటే..!

LPG Gas Price: బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందంటే..!


LPG Gas Cylinder Price: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం, ఎల్‌పిజి కొరత నిరంతరం ఏర్పడుతోంది. ఈ కారణంగానే 19-కేజీల సిలిండర్ల ధర నిరంతరం పెరుగుతోంది. ఈ ఏడాది ఇది వరుసగా ఏడవ పెరుగుదల. కేవలం ఆరు నెలల్లోనే 19-కేజీల సిలిండర్ ధర 97% పెరిగింది.

ఇప్పడు తాజాగా జూన్ 1వ తేదీన ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ప్రజలు మరోసారి తీవ్రంగా దెబ్బతిన్నారు. గ్యాస్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను రూ.42 పెంచడంతో దాని ధర రూ.3,113.50కి చేరింది. కోల్‌కతాలో ధరలు రూ.53.50 పెరగడంతో మొత్తం ధర రూ.3255.50కి చేరింది. ఢిల్లీలో 5 కిలోగ్రాముల FTL (ఫ్రీ ట్రేడ్ LPG) సిలిండర్ల ధర రూ.11 పెరిగింది. దీంతో దాని ధర రూ.821.50గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?

ముఖ్యంగా మే నెలలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.993 పెరిగి రూ.3,000 మార్కును దాటింది. అదే సమయంలో చిన్న సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఉపశమనం.

ఏఎన్ఐ ‘ఎక్స్’ లోని ఒక పోస్ట్ ప్రకారం.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒక పెద్ద ఊరట లభించింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. దీని ఫలితంగా ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పీజీ ధర ఇప్పుడు రూ.913, కోల్‌కతాలో రూ.939, ముంబైలో రూ.912.50, హైదరాబాద్‌లో రూ.965, చెన్నైలో రూ.928.50 గా ఉంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలలో చివరి మార్పు మార్చి 7వ తేదీన జరిగింది. అప్పుడు దీని ధర రూ.60 పెరిగింది.

Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *