తాజావార్తలు

Kayadu Lohar: 16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం.. బండరాయితో అతని తల పగలగొట్టిన హీరోయిన్

Kayadu Lohar: 16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం..   బండరాయితో అతని తల పగలగొట్టిన హీరోయిన్


అస్సాంలో పుట్టి పెరిగినా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది కాయదు లోహర్. తన అందం, అభినయంతో కుర్రకారులో క్రేజ్ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఒక కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కయాదు ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మొదటి సారిగా పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ప్రదీప్ రంగనాథన్ తో చేసిన డ్రాగన్ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత కాయదుకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోందీ అందాల తార.
ఈ ఏడాది ఇప్పటికే ఫంకీ, పళ్లిచట్టంబి సినిమాల్లో నటించింది లోహర్. అలాగే నానితో కలిసి నటించిన ది ప్యారడైజ్ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా సూర్య 48 సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైందీ అందాల తార. వీటితో పాటు పలు తెలుగు, తమిళ, మలయాళ ప్రాజెక్టులు కాయదు చేతిలో ఉన్నాయి.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోన్న కాయదు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో 16 ఏళ్లున్నప్పుడు తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ‘పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్‌కు వెళ్తుండేదాన్ని. అయితే ప్రతిరోజూ ట్యూషన్‌కు వెళ్లే మార్గంలో కొందరు అబ్బాయిలు నన్నుఈవ్ టీజింగ్ చేసేవారు. సూటి పోటి మాటలతో వేధించేవారు. మొదటి రెండు రోజులు ఏమీ అనకుండా మౌనంగా భరించాను. కానీ మూడో రోజు కూడా ఒక కుర్రాడు హద్దులు మీరి ప్రవర్తించాడు. దీంతో భయం, కోపం, నిస్సహాయత ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. భరించలేక రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని ఆ కుర్రాడి వైపు బలంగా విసిరాను. అది వెళ్లి అతడి తలకు బలంగా తగలడంతో రక్తం కారింది. చూడటానికి నేను చాలా సాఫ్ట్‌‌గా కనిపిస్తాను. కానీ ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుంది. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని’ అని అప్పటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంది కయాదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి



ట్రెడిషినల్ శారీలో కాయదు లోహర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *