సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. మంచి ఆలోచనలను, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే వేదిక. అందుకే ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ అండ్ టీం..తమ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను.. లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం వేదికగా జరుపుకుంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని ఈ ఆరోగ్య గ్రామంలో నిర్వహించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరుముడి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ లక్ష్మణ్ ఆరోగ్య గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. దాదాపు నాలుగు గంటల పాటు అక్కడి వాతావరణం, ప్రకృతి ఆధారిత జీవన విధానం, ఆరోగ్య పరిరక్షణ పద్ధతులు, అందించే ఆరోగ్య డైట్ తదితర అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. అక్కడి ప్రత్యేకతలను పరిశీలించిన శివ నిర్వాణ.. ఇంత సమగ్రమైన ఆరోగ్య వాతావరణం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ప్రతి ఒక్కరూ ఇక్కడి అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో అందిస్తున్న ఆహార విధానం, ప్రకృతి అనుకూల వాతావరణం, ఆరోగ్యాన్ని కేంద్రంగా చేసుకున్న జీవన విధానం ‘ఇరుముడి’ చిత్ర బృందాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చిత్ర బృందం అభిప్రాయపడింది. లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో ఉన్న ప్రత్యేకతలను దగ్గరగా తెలుసుకున్న అనంతరం దర్శకుడు శివ నిర్వాణ.. ఈ ప్రదేశాన్ని, ఇక్కడ అందుబాటులో ఉన్న ఆరోగ్య అవకాశాలను అభినందించారు. ఆరోగ్యం కోసం ప్రజలు తప్పనిసరిగా ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. లక్ష్మణ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ.. ఆరోగ్యంపై అవగాహన పెంచే విధంగా ఈ గ్రామం మరింత మందికి చేరువ కావాలని ఆకాంక్షించారు. మరోవైపు ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవాన్ని లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో నిర్వహించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. సాధారణంగా సినిమా సక్సెస్ వేడుకలు హోటళ్లు, ఈవెంట్ హాళ్లలో జరుగుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ప్రకృతి, ఆరోగ్యం, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీకగా నిలిచే లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో విజయోత్సవాన్ని నిర్వహించడం ఆసక్తిని రేకెత్తించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..
Puri Jagannath: ఏం జరిగినా మన మంచికే.. గాయాలు మానాకే.. అసలు సినిమా..!
Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్
Hanuman Ansh: హనుమాన్ అంశ్ తెలుగు ఎలా ఉంటే.. హిట్టా.. ఫట్టా
Comrade Kalyan: వీడు కామెడీ కళ్యాణ్.. ఎలా ఉందంటే..
