తాజావార్తలు

Ind vs WI 2nd ODI: గౌహతి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం


గౌహతిలోని బర్సపార క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, పర్యాటక జట్టుపై అలవోకగా నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 405 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ లక్ష్యాన్ని ఈజీగా చేధించింది. తొలుత ఓపెనర్లు వచ్చిన శుభమిన్ గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ అద్బుత సెంచరీతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోశించారు.

తొలుత టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జాన్ చంప్‌బెల్ 68 బంతుల్లో 101 పరుగులు చేయగా, షాయ్ హోప్ 94 బంతుల్లో 104 పరుగులు, అమీర్ జంగూ 77 బంతుల్లో 114 పరుగులు చేసి భారత్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఇక మొత్తం 50 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు భారత్ ముందు 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇక భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు సైతం అదే ఊపుతో వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేశారు. తొలుత ఓపెనర్లు వచ్చిన శుభమన్‌ గిల్ డబుల్ సెంచరీ(133 బంతుల్లో 223)తో అదరగొట్టగా.. 75 బంతుల్లో 101 పరుగులు చేసిన భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక తర్వాత వచ్చిన కోహ్లీ 19 బంతుల్లో 29, గౌక్వాడ్ 37 బంతుల్లో 31 పరుగులు చేయడంతో 6 ఓవర్ల 3 బంతులు ఉండగానే భారత్ విజయలక్ష్యాన్ని చేధించింది.

అయితే ఈ ఇది మొత్తం మూడు వన్డేల సిరీస్ కావడంతో.. తొలి వన్డేలోనూ భారత్ వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తాజాగా రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించడంతో.. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *