తాజావార్తలు

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?


IND vs AFG T20 Series Live Streaming: భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

ఓటీటీలో మ్యాచ్‌లు చూడాలనుకునే వారికి సోనీ లివ్, జియో హాట్‌స్టార్‌లో వీక్షించే అవకాశం లేదు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో మాత్రమే ఈ మ్యాచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఎక్కువమంది చదివినది: Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..!

ఇవి కూడా చదవండి



ఈ సిరీస్ ముందు టీమ్ ఇండియాకు కొన్ని ప్లేయర్ ఫిట్‌నెస్ అప్‌డేట్స్ ఉన్నాయి. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సహా మరో ఇద్దరు ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే తొలి T20 మ్యాచ్‌కు మరో నాలుగు రోజులే సమయం ఉండగా, బుమ్రా ఇంకా మ్యాచ్ సిమ్యులేషన్ పూర్తి చేయలేదు. ఈ నెల తొమ్మిదవ తేదీన అతడు ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొనే అవకాశం ఉంది. టెస్ట్ పూర్తయ్యాకే బుమ్రాను సిరీస్‌కు పంపాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఇక, హర్షత్ రాణ, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఇప్పటికే ఫిట్‌నెస్ టెస్టులు, మ్యాచ్ సిమ్యులేషన్ పూర్తి చేశారు. అయినప్పటికీ, వారిని ఇంకా పూర్తిగా ఫిట్‌గా ప్రకటించలేదు. ఈ నెల తొమ్మిదిన సాయంత్రానికి తుది ఫిట్‌నెస్ నివేదిక వెలువడే అవకాశం ఉంది.

ఎక్కువమంది చదివినది: Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *