తాజావార్తలు

Gold Prices: బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. పండక్కి ముందే ఊహించని మార్పు.. అక్టోబర్ 10న తులం ఎంతంటే..?


బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూ్స్. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలో నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ, దీపావళి లాంటి పెద్ద పండుగలు వస్తున్న క్రమంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్ క్రమంలో ధరలు పెరగడం కొనుగోలుదారులకు నిరాశను మిగుల్చుతోంది. బంగారం, వెండి, ప్లాటినం, దిగుమతులపై బ్యాంకుకలు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపును కేంద్రం రద్దు చేసింది. దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 10వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

బంగారం ధరలు ఇవే..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,160 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,160గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,160గా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,870 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,310గా కొనసాగుతోంది.

సిల్వర్ రేట్లు నేడు ఇలా..

ఇక సిల్వర్ ధరలు భిన్నంగా ఉన్నాయి. బంగారంతో పోలిస్తే వెండి రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,34,800 వద్ద ట్రేడవుతోంది

హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గా కొనసాగుతోంది. శుక్రవారం రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.

చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది.

బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,34,800 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,34,900గా ఉంది,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *