తాజావార్తలు

Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?


అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత బంగారం కొనుగోలు దారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ దేశాల మధ్య యుద్ధం కారణంగా రూ.లక్షలోపు ఉన్న బంగారం ధరలు కాస్తా.. ఒకానొక సమయంలో ఆల్‌టైం రికార్డు రూ.2లక్షల చేరువకు వెళ్లాయి. తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితులు ప్రభావంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా పచ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గడంతో చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

ఈ మార్పుల తర్వాత బుధవారం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,51,360 వద్ద కొనసాగుతుండగా నిన్న ఈ ధర రూ.1,51,370 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే పెద్దగా మార్పులు ఏమి కనిపించకపోయినప్పటీ.. ఈ తగ్గుముఖం అనేది ప్రజలకు ఊరట కల్పిస్తుంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగాం ధర రూ. 1,38,740గా ఉండగా 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,520 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. బుధవారం ఉదయం 6 గంటలకు దేశీమ మార్కెట్‌లో వెండి ధర చూసుకుంటే కేజీ వెండి ధర రూ.2,64,900గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,360. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,51,360. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,360. 22 క్యారెట్ల ధర రూ.1,38,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,360, 22 క్యారెట్ల ధర రూ.1,38,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,51,510. 22 క్యారెట్ల ధర రూ.1,39,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.153,370, 22 క్యారెట్ల ధర రూ.1,40,590 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.

ఇది గమనించండి?

అయితే బంగారం ధరలు అనేవి.. ఎప్పుడూ స్థిరంగా ఉండవు.. అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

FAQ

  • ప్రశ్న: బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయా?

  • జవాబు: అంతర్జాతీయ శాంతి పరిస్థితులు, డాలర్ బలాన్ని బట్టి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

  • ప్రశ్న: 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారానికి తేడా ఏమిటి?

  • జవాబు: 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం (నాణేలు/బిస్కెట్లు) అయితే, 22 క్యారెట్ ఆభరణాల తయారీకి వాడే బంగారం.

  • ప్రశ్న: నగరాల వారీగా బంగారం ధరలలో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?

  • జవాబు: స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు మరియు అక్కడి నగల సంఘాల నిర్ణయాల వల్ల ధరలు మారుతుంటాయి.

  • ప్రశ్న: బంగారం కొనేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఏం చూడాలి?

  • జవాబు: నగపై ప్రభుత్వం గుర్తించిన ‘BIS హాల్‌మార్క్’ ముద్ర, ఆరు అంకెల HUID కోడ్ తప్పక చూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *