ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు. మీ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు లాన్ ఇన్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే రెండు, మూడు, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితికి ముందే మీరు ఎఫ్‌డీ అకౌంట్ క్లోజ్ చేసి నగదు తీసుకోవడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి.
