తాజావార్తలు

Dasara Navratri 2026: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు


కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ నగరం భక్తిభావంతో మైమరిచిపోతుండగా, ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. విద్యుద్దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి మహాగ్రహంలా మెరిసిపోతుంటే, జగన్మాత కనకదుర్గ ఆలయం దివ్యమైన దేదీప్యమాన కాంతులతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొండపైన, కొండ దిగువనా విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల తొలి రోజైన ఇవాళ ఉదయం 8 గంటల నుంచి భక్తులను దేవి దర్శనానికి అనుమతిస్తున్నారు. నవరాత్రుల తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తున్నారు. కొండ దిగువన ఉన్న వినాయకుడి ఆలయం వద్ద నుంచి భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా కొండపైకి నడిచి వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్‌!

బాబోయ్‌.. వింతపాము…రెండు తలలు, నాలుగు కాళ్లతో

చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం

ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *