తాజావార్తలు

CSK vs MI : సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు.. ముంబైపై చెన్నై సూపర్ విక్టరీ

CSK vs MI : సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు..  ముంబైపై చెన్నై సూపర్ విక్టరీ


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్‌ దిర్ 57, రికల్టన్ 37 మినహా మిగతా బ్యాటర్స్ ఎవరూ పెద్దగా రాణించలేదు. దీనికి తోడు అటు చెన్నై బౌలర్లు సైతం ముంబై బ్యాటర్లను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో ముంబై పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. కేవలం 160 పరుగల లక్ష్యాన్ని మాత్రమే చెన్నై ముందుఉంచగలిగింది.

ఇక 160 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై మొదటి నుంచే మంచి స్కోర్ చేస్తూ ముందుకు సాగింది. ఓపెనర్లుగా వచ్చిన గైక్వాడ్, సంజూ మంచి స్టార్ట్ ఇవ్వగా.. సంజూ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు. గైక్వాడ్ 48 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు కీలక విజయాన్ని అందించారు. అతనికి తోడుగా యువ బ్యాటర్ కార్తీక్ శర్మ 40 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *