హార్ముజ్ మూసివేత.. మరో మార్గం కనిపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ!
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్లు ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు, భద్రతా భయాలు పెరగడంతో, ప్రపంచ షిప్పింగ్ రంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల ప్రభావంతో ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన…
