తాజావార్తలు

Actress Meena : ఇండస్ట్రీలో ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..

Actress Meena : ఇండస్ట్రీలో ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..


హీరోయిన్ మీనా గురించి తెలిసిందే. దశాబ్దాలుగా సినీరంగంలో బిజీగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసే వారికి లభించే ప్రచారాన్ని, ప్రాధాన్యతను చూసి, తాను కూడా అలాంటి పాత్రలు చేయాలనే ఆలోచన వచ్చిందని ఆమె వెల్లడించారు. తాను ఎప్పుడూ “సాఫ్ట్” ఇమేజ్ తోనే ఉండేదాన్నని, ఆ సమయంలో గ్లామర్ పాత్రలు చేస్తే తనకు కూడా ఎక్కువ గుర్తింపు లభిస్తుందేమోనని అనుకున్నానని చెప్పారు. అయితే, తర్వాత కాలంలో తన ఆలోచన మారింది. తన కెరీర్ ఇంత నిలకడగా ఉండటానికి, తనకు లభించిన ఈ గౌరవప్రదమైన ఇమేజ్‌కి తన పాత్రల ఎంపికే కారణమని అన్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు తన పాత్రను గుర్తుంచుకోవాలనే లక్ష్యంతోనే ప్రతి చిత్రాన్ని ఎంపిక చేసుకునేదాన్నని ఆమె తెలిపారు. బయట ప్రచారాల కంటే ప్రజలు తమను గౌరవించి, గుర్తుంచుకోవడమే నిజమైన విజయమని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..

తన కాలంలో రమ్యకృష్ణ, రోజా, రంభ వంటి వారితో పోల్చి చూసుకుంటే, రోజాతో తనకు ఎక్కువ పోటీ ఉండేదని మీనా పేర్కొన్నారు. “రోజా-మీనా, మీనా-రోజా” అన్నట్లుగా తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని, ఒకరి చిత్రం చేయలేకపోతే మరొకరు చేసేవారని ఆమె వివరించారు. ఈ పోటీ కేవలం కెమెరా ముందు మాత్రమే ఉండేదని, షూటింగ్ పూర్తయిన తర్వాత అందరం కలిసి కార్డులు ఆడుకోవడం, భోజనం చేయడం వంటివి చేసేవారని మీనా తెలిపారు. తమ తరం నటీమణులైన సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, నగ్మాలతో పాటు సీనియర్ నటీమణులైన ఖుష్బూ, రాధిక వంటి వారందరూ ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారని మీనా గర్వంగా చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సౌందర్య స్థాయి వేరు అని అన్నారు. “సౌందర్య చాలా మంచి వ్యక్తి, ఎంతో ప్రతిభావంతురాలు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ హెల్తీ కాంపిటీషన్ (ఆరోగ్యకరమైన పోటీ) ఉండేది. ఆమె నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్” అని మీనా చెప్పుకొచ్చారు. “నిజానికి ఆ రోజు సౌందర్యతో పాటు నేను కూడా అదే హెలికాఫ్టర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సింది. నన్ను కూడా ఆ ప్రచారానికి రమ్మని ఆహ్వానించారు. కానీ నాకు పాలిటిక్స్, ఎలక్షన్ క్యాంపెయిన్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దాంతో షూటింగ్ బిజీగా ఉందని చెప్పి నేను ఆ ప్రయాణాన్ని స్కిప్ చేశాను” అని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *