Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కొత్తగా రెండు రైల్వే లైన్లు.. అప్పటికల్లా పూర్తి..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య బళ్లారి-గుంతకల్ మార్గంలో అదనంగా మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మూడు, నాలుగవ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.1,264 కోట్లుగా అంచనా వేశారు. ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్ 2028-29 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని…
