Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..
సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాము, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఎప్పుడైనా కింగ్ కోబ్రాతో ఓ చిన్న పిల్లి ముఖాముఖి తలపడటం చూశారా? వినడానికే కాస్త వింతగా అనిపించినా.. తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తనను కాటు వేయడానికి విరుచుకుపడిన విష సర్పానికి పిల్లి చుక్కలు చూపించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది….
