ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కలబంద (Aloe Vera) సాగు రైతులకు, యువ పారిశ్రామికవేత్తలకు మంచి వ్యాపార అవకాశంగా మారుతోంది. ఔషధ గుణాలు అధికంగా ఉండే ఈ మొక్కకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కాస్మెటిక్స్, హెల్త్ డ్రింక్స్, ఆయుర్వేద ఔషధాలు, స్కిన్‌కేర్ ఉత్పత్తుల్లో కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
