తాజావార్తలు

Balapur Ganesh Laddu Live: ఈసారి సరికొత్త రికార్డులు..! అందరిచూపు బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం పాటపైనే..


అందరిచూపు బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం పాటపైనే నెలకొంది.. మరికాసేపట్లో వేలంపాట జరగనుంది.. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి… ఉదయం 7గంటలకు గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఉదయం 9:00 గంటలకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని.. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్‌ విగ్రహాన్ని తీసుకువస్తారు.. ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. లడ్డూ వేలం తర్వాత హుస్సేన్‌ సాగర్‌కు బాలాపూర్‌ గణేష్ ను తరలించనున్నారు. 18 కిలోమీటర్లపాటు బాలాపూర్ గణేష్‌ శోభాయత్ర కొనసాగనుంది.. ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *