తాజావార్తలు

Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే


Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఏజెంట్ తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడీ అక్కినేని అందగాడు. మురళీ కిశోర్‌ తెరకెక్కించిన లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలు కూడా చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఈ క్రమంలో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన అఖిల్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మూడేళ్లు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

‘ఏజెంట్’ సినిమా‌ తర్వాత వరసగా సినిమాలు చేయాలనుకున్నాను. కానీ ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయి. ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. 8 నెలల పాటు బరువులు ఎత్తలేకపోయాను. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలలు పట్టింది. ఇలా మూడేళ్లు విరామం తీసుకున్నందుకు నా అభిమానులు నాపై చాలా కోపంగా ఉన్నారు. ఇలా మరోసారి జరగదని వాళ్లకు నేను హామీ ఇస్తున్నాను’ అని అఖిల్‌ చెప్పుకొచ్చారు.

లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే, అఖిల్ అక్కినేని..

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

 

ఇక లెనిన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా కథ వినగానే కొత్త అనుభూతి కలిగింది. పాత్రల్లోని విభిన్న కోణాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి స్టోరీతో కానీ ఈ అంశంమీద కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఇలాంటి సినిమాతోనే కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *