తాజావార్తలు

Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..

Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..


Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..

ప్రముఖ నటి లైలా గుర్తుందా.? ఒకప్పుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటిలో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఆతర్వాత ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నటి సౌందర్యతో కలిసి పనిచేసిన రోజులను లైలా గుర్తుచేసుకుంటూ, ఆమె ఎంతో ఆప్యాయంగా ఉండే మంచి వ్యక్తి అని కొనియాడారు. సౌందర్య మరణం గురించి తెలిసినప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను. ఇప్పటికీ ఆ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అది చాలా బాధాకరం అని లైలా తన మనసులోని మాటను పంచుకున్నారు.

సౌందర్య మరణ వార్తను విన్నప్పుడు తన మొదటి స్పందన ఏమిటన్న ప్రశ్నకు లైలా స్పందిస్తూ, ఆ వార్తను అసలు నమ్మలేకపోయానని, దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైందని తెలిపారు. అప్పటి తరం హీరోయిన్స్‌లో రమ్యకృష్ణ, జ్యోతిక, త్రిష వంటి వారితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నట్లు లైలా పేర్కొన్నారు. సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎదురైన అనుభవాలను, అభిమానుల ఆదరణను లైలా వివరించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ చాలా స్వీట్‌గా ఉంటుందని, తెలుగు, తమిళ అభిమానులు సమానంగా తనను ఆదరిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ తనను ఆదరిస్తున్నారని, మాఘమాసం పాట ద్వారా తనను గుర్తుపెట్టుకున్నారని తెలిపారు.

ఎగిరేపావురం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా, తనను ఇప్పటికీ ఆ సినిమాతోనే ఎక్కువగా గుర్తుచేసుకుంటున్నారని, ఇది చాలా  అందమైన అనుభవమని లైలా అన్నారు. శ్రీకాంత్ గారిని మళ్లీ కలవడం జరిగిందా అని అడగగా, ఆ సినిమా సమయంలోనే తప్ప ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదని లైలా చెప్పారు. మోహన్ బాబు గారితో ఒక సినిమా చేశారని, ఆయన చాలా స్ట్రిక్ట్, పంక్చువల్ పర్సన్ అని ప్రచారంలో ఉందని వినబడగా, లైలా దానిపై స్పందించారు. నేను కూడా చాలా పంక్చువల్ పర్సన్‌ను. అందరిలోకీ నేను అత్యంత పంక్చువల్‌గా ఉంటానని అనుకుంటాను. నేను అందరితో చాలా బాగా మాట్లాడతాను, కాబట్టి అందరూ నాతో బాగానే ఉంటారు అని లైలా చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Laila (@laila_laughs)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *