తాజావార్తలు

ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ, పీజీ అర్హతలతో IBPS బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ, పీజీ అర్హతలతో IBPS బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 745 అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం మూడు దశల్లో తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంకుల్లో విధులు కేటాయిస్తారు..

పోస్టుల వివరాలు..

  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్ 1) పోస్టులు: 190
  • హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ 1) పోస్టులు: 60
  • ఐటీ ఆఫీసర్ (స్కేల్ 1) పోస్టులు: 301
  • లా ఆఫీసర్ (స్కేల్ 1) పోస్టులు: 105
  • రాజ్‌భాష అధికారి (స్కేల్ 1) పోస్టులు: 89

IBPS బ్యాంకు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టును అనుసరించి ఐటీ ఆఫీసర్‌ పోస్టులకుకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధఙత అగ్రికల్చర్‌ విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. లా ఆఫీసర్‌ పోస్టులకు ఎల్‌ఎల్‌బీ, పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్‌/ హెచ్‌ఆర్‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా లో పీజీ డిప్లొమా ఉండాలి. హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌తో పాటు హెచ్‌ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ లేబర్ లా/ సోషల్ వర్క్ తదితరాల్లో రెండేళ్ల పూర్తి పీజీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత పొందాలి. రాజ్‌భాషా ఆఫీసర్‌ పోస్టులకు హిందీలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్ చదివి ఉండాలి లేదా సంస్కృతంలో పీజీతోపాటు గ్రాడ్యుయేషన్‌లో హిందీ, ఇంగ్లిష్ చదివి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి



ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ (ప్రిలిమినరీ, మెయిన్) రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపుకు చివరి తేది: జులై 21, 2026.
  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: ఆగస్టు 2026లో
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు 2026లో
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: సెప్టెంబర్‌/అక్టోబర్‌లో
  • ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్‌ 2026లో
  • ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌/డిసెంబర్‌ 2026లో
  • ఎంపిక జాబితా వెల్లడి: జనవరి 2027లో

IBPS బ్యాంకు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *