మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలంతా బాగా అనుకూల ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి., వ్యయ ప్రయాసలు ఉండకపోవచ్చు. చేపట్టిన ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో నెరవేరుతాయి. ఆర్థి కంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. ఇంటా బయటా శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో పదవి, హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణకు లోటుండదు. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి శని, శుక్ర, బుధుల అనుకూలత వల్ల ఈ నెలంతా చాలావరకు సంతృప్తికరంగా గడి చిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ఉన్నత కుటుంబా నికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. అనుకూలమైన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిత్రుల మూలంగా కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వంటివి చేయక పోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆశించిన శుభ వార్తలు వినడం జరుగు తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ధన స్థానంలో ఉచ్ఛ గురువుతో సహా ముఖ్యమైన శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆశిం చిన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగి పోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా సత్ఫలితాలు పొందుతారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం కలు గుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభసా టిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అనుకోకుండా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని కష్టనష్టాలు తప్పకపోవచ్చు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. పిల్లలకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి బలం వల్ల వ్యక్తిగత జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అష్టమ శని వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సుఖ సంతోషాలు, మనశ్శాంతి తగ్గుతాయి. వ్యయ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల శుభ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. తల్లితండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు సమయం మరింత అనుకూలంగా ఉంది. ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దశమ, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా వ్యయ ప్రయాసలుంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యల వల్ల ఇబ్బందులు పడ తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా నిదానంగా పూర్తవుతుంది. వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. మంచి సంస్థల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడ తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెలంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యో గాల్లోనే కాకుండా, కుటుంబంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లలు విజ యాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశికి సప్తమ, భాగ్య స్థానాలు బాగా పటిష్ఠంగా ఉన్నందువల్ల నెల రోజుల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం అను కూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం సజావుగా సాగిపో తుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు సునాయాసంగా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలి తాలనిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అదనపు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయంలో రాశ్యధిపతి శని, సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా సమయం కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుం టారు. ఉద్యోగ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిల కడగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకా రాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుజ, రవులు, ఈ నెల 7 తర్వాత బుధుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధ మైన ఏ ప్రయత్నమైనా ఘన విజయం సాధిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశంఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా చికాకు కలిగిస్తాయి. వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవ కాశాలు అంది వస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పిల్లలు చదువుల్లో కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ నెలంతా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. జీవనశైలిలో మార్పు వస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధికారుల అండ దండలకు లోటుండదు. సహోద్యోగులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అంచనాలకు మించి ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయానికి కూడా ఇబ్బంది ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపా రాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బాగా లాభపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలు విజయవంతం అవుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.












