మన వంటిల్లే ఒక ప్రకృతి ప్రసాదిత మెడికల్ షాపు వంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు వెంటనే అలోపతి మందులను ఆశ్రయించి, ఆపై సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడేకంటే, మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతోనే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలలో యాలకులు ప్రధానమైనవి.. యాలకులు ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా, రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమైనవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు రోజు రాత్రి ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా కరిగిస్తుంది. నిత్యం యాలక్కాయను తిని వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికరమైన మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాదు, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలను శుద్ధి చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు సరిగా జీర్ణం కాక అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగానే అనేకమంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ నియమాన్ని పాటించడం వల్ల మలబద్ధకం సమస్య నుండి విముక్తి పొందడమే కాకుండా, తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.
మరీ ముఖ్యంగా, చాలామంది రాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాసు వేడి నీళ్లు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే, నిద్రలేమి సమస్య తొలగిపోయి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో గురక శబ్దం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యాలక్కాయను తిని వేడి నీళ్లు తాగడం వల్ల ఇది ఒక మెడిసిన్ లా పనిచేసి, నిదానంగా గురక తగ్గుతుంది.
ఈ చిట్కా కేవలం అంతర్గత ఆరోగ్యానికే కాదు, బాహ్య సౌందర్యానికి కూడా తోడ్పడుతుంది. రోజు ఇలా చేస్తే ఎముకలను బలంగా మారుస్తుంది. అంతేకాకుండా, ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఆరోగ్యంగా, ఒత్తుగా పెంచేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం లేదా నిద్రకు ముందు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. యాలుకులను తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
